telangana
రైతుల వద్దకే రెవెన్యూ సదస్సు - హాజరైన సబ్ కలెక్టర్ హర్ష చౌదరి
సూర్య,కౌటాల : గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి సూచించారు. కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన శుక్రవారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎన్నో ఏళ్లుగా భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి సమస్యలను రైతుల సమక్షంలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు వారి వద్దే రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గ్రామస్థాయిలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రమోద్ రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు