BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్

Select Suryaa Now
రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్

బయ్యారం, మేజర్ న్యూస్, కోయగూడెం, కాచనపల్లి గ్రామాల రైతుల చేతికందిన మొక్కజొన్న పంటను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను గుర్తించిన కోయగూడెం సర్పంచ్ లింగ నాయక్ స్పందించారు.రైతులు పెద్దవాగు దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో సర్పంచ్ చొరవ తీసుకొని జేసీబీ యంత్రం సహాయంతో సిమెంటు గొట్టాలను ఏర్పాటు చేయించి తాత్కాలిక దారిని అందుబాటులోకి తీసుకొచ్చారు.పంట చేతికొచ్చిన సమయంలో రవాణా సౌకర్యం లేక రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సర్పంచ్ లింగ నాయక్ వెంటనే స్పందించి పెద్దవాగు దాటేందుకు వీలుగా తాత్కాలిక దారి ఏర్పాటు చేయించారు.దీంతో ఇరు గ్రామాల రైతులకు పంట తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులు కొంతమేర తొలగనున్నాయి.రైతుల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ చొరవ చూపడంపై కోయగూడెం,కాచనపల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లింగ నాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను సకాలంలో తరలించుకునేందుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.త్వరలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నిధులతో ఈ మార్గంలో శాశ్వత వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక ఇంజినీరు,సహాయ ఇంజినీరు శ్రీనివాస్, గుత్తేదారు రవి,ఇరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;స్వామి, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా