BREAKING
పోలీస్ స్టేషన్ వద్ద కత్తితో దాడి.. కేసు నమోదు కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ బ్రిటన్ టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా

రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడికి ఘన స్వాగతం

Select Suryaa Now
రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడికి ఘన స్వాగతం
సూర్య, మందమర్రి. : తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. హుస్సేన్‌కు మందమర్రిలో సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పర్యటనకు వెళ్తున్న ఆయన శుక్రవారం పట్టణానికి చేరుకోగా, స్థానిక ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం ప్రతినిధులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో సంఘం ఐక్యత, ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సంఘటితంగా ఉంటూ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్లకొండ కనకయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు పసుల వెంకటస్వామి, కోశాధికారి బద్రి సతీష్, ఉపాధ్యక్షులు ఆర్. సుజిత్, నక్క పవన్, లక్కిరెడ్డి అనిధర్, మాజీ ఉపాధ్యక్షుడు విక్టరీ అశోక్, గౌరవ సలహాదారులు నక్క తిరుపతి, కామెర మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతరేణి శ్వాస తిరుపతి, కోశాధికారి మూక్కెర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న సుధాకర్, కుటుంబ భరోసా ఇన్‌చార్జి నూనె సురేష్, రొమాంటిక్ స్టూడియో అధినేత సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. హుస్సేన్‌కు నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సంఘ సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.