రాగంపేట్ సర్పంచ్ ఎలగందుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ
*ఖానాపూర్ , వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మరియు బాలింతలకు అందించే బాలామృతం, పాలు, కోడిగుడ్లను సర్పంచ్ ఎలగందుల రాజు చేతుల మీదుగా బుధవారం పిల్లల తల్లులకు అందజేశారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, బాలింతలు పాల్గొన్నారు.