ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి
వికారాబాద్, మేజర్ న్యూస్: పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 10వ వార్డు కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహారెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ లభిస్తుందని, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఈ పథకం గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు.అనంతరంఆయన మాట్లాడుతూ… కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ బృహత్తర పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 10వ వార్డులో అర్హులైన ఒక్క కుటుంబం కూడా ఈ పథకానికి దూరం కాకుండా స్వయంగా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికీ పథకం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బీమా పథకం అమలులో ఎవరికైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని, 9440006698 నంబర్‌కు ఫోన్ చేస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ వినోద్ కుమార్, మాజీ కౌన్సిలర్ మురళి, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్ రాజు నాయక్, వాటర్ ఆఫీసర్ శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు, అనంతగిరిపల్లి సోషల్ మీడియా ఇన్‌చార్జి నందు,వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.