ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుచరిత
పెద్ద శంకరంపేట్;ప్రతి ఒక్కరు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అల్లాదుర్గం సివిల్ జడ్జి సుచరిత అన్నారు.. శనివారం పెద్ద శంకరంపేట లోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు వ్యవసాయానికి సంబంధించిన పలు చట్టాల పైన అవగాహన కల్పించారు. ప్రజలు తమ భూములకు సంబంధించిన వివరాలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంబంధిత రికార్డులను పరిశీలించు కోవాలని పేర్కొన్నారు. వృద్ధుల పట్ల తమ పిల్లలు బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు. వారికి కావలసిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి.. సిబ్బంది.. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..