BREAKING
శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కట్లబండలో సౌర విద్యుత్ వెలుగులు.. 3 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ట్రక్ పార్క్ భూముల విక్రయంపై హరీష్ రావు ఆగ్రహం.. కోవూరు నగర్‌లో గుంతల పూడ్చివేత పనులు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి *నాయుడ్నూర్ పవన్ రావు ఉత్సాహంగా.. ఉల్లాసంగా *మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు.

*ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలి* *-మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత*

Select Suryaa Now
*ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకోవాలి*  *-మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత*

సూర్య న్యూస్…మధిర 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో మధిర పట్టణంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత పిలుపునిచ్చారు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు  గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఈ పథకం నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు.ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తూ దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు,ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడారు.పట్టణంలోని ఈనెల 17, 18,తేదీల్లో  ప్రతి వార్డులో వార్డు కౌన్సిలర్,కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,మున్సిపల్ అధికారులతో కలిసి వారు వారి వార్డుల్లో బాధ్యత తీసుకొని, టమకాలు వేయించి, విస్తృత ప్రచారం  చేసి సమన్వయంతో పనిచేస్తూ ప్రతి కుటుంబాన్ని ఈ జీవిత బీమా పథకంలో చేర్చాలని కోరారు.మధిర పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సామినేని సుజాత శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.