BREAKING
ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా జి.రామాంజనమ్మ నామినేషన్ దాఖలు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు ముంబైలో సచిన్ టెండూల్కర్‌తో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ సందడి రామాయణ సక్సెస్‌పై ధనుష్ ప్రశంసలు.. సాయి పల్లవి ఆసక్తికర రిక్వెస్ట్! నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు. - సర్వే నంబర్‌ 401 భూములు నిషేధిత జాబితాలోనే - భూములున్నా హక్కులు లేవు.. అమ్ముకోలేరు.. కొనలేరు..! గంటలో పెళ్లి కాకపోతే వెళ్లిపోతానన్న పంకజ్ కపూర్.. ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియా పాఠక్! కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం పశ్చిమాసియాలో అమెరికా మరో నౌకాదళ మోహరింపు దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం - మంత్రి జూపల్లి కృష్ణారావు

Select Suryaa Now
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం -  మంత్రి జూపల్లి కృష్ణారావు

అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర నిరుపేద వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించి వారు ఆత్మగౌరవంతో జీవించేలా సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా 3,696 మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు.
సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని రాజా గారి బంగ్లా సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. పింఛన్ల మంజూరులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ప్రస్తుతం పింఛన్ మంజూరు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, సహజ ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి చేయూత పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కొత్తగా మంజూరైన పింఛన్లలో కొల్లాపూర్ మండలానికి 355, కొల్లాపూర్ మున్సిపాలిటీకి 318, పెద్దకొత్తపల్లి మండలానికి 838, కోడేరు మండలానికి 481, పెంట్లవెల్లి మండలానికి 302, ఏదుల మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలకు 108 పింఛన్ల మంజూరు పత్రాలను కార్యక్రమంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేసు, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, పీడీ హౌసింగ్ గోపాల్ నాయక్, వైస్ చైర్మన్ రహీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పసుపుల నరసింహ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్, సూర్య న్యూస్