పోస్ట్ ఆఫీస్ లో ఉచిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల అందజేత ప్రారంభం
సూర్య- బిక్కనూర్ : మండల కేంద్రంలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ లో పదవి విరమణ పొందిన బీడీ కార్మికులు, ఉద్యోగులు నవంబర్లో సమర్పించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఉచితంగా సమర్పించే కార్యక్రమాన్ని బుధవారం పోస్ట్ ఆఫీస్ మేనేజర్ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యులైన బీడీ కార్మికుల వద్ద దళారులు ఇండ్లలోకి వెళ్లి వందలాది రూపాయలు తీసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పోస్ట్ ఆఫీస్ లలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పించడానికి అవకాశం కల్పించిందని, పదవి విరమణ పొందిన ప్రతి బీడీ కార్మికురాలు, ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ లో ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సురేష్, రామచంద్రం, లబ్ధిదారులు పాల్గొన్నారు.