పూల పండుగగా బతుకమ్మ సంబరాలు
నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి,బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను గ్రామంలోని పోచమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఓపీఎం రామకృష్ణ, హెచ్ఆర్ ఆసిఫ్,ఆఫ్ రూల్స్ సూపర్వైజర్ ప్రకాష్,ఎంఎన్టీ మహేష్ అక్షయపాత్ర ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.