పంచాయతీల అభివృద్ధిలో వేగవంతం చేయాలి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. శాలిగౌరారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాల అమలు, స్థానిక మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎంపీ చామల సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.