BREAKING
'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు * వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు - ఏ డి ఏ అపర్ణ # చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆశ్వీయుజ పౌర్ణమి పూజలు సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి - అదనపు కలెక్టర్ వై వి గిరి పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పీఏసీఎస్‌ పీఠాలపై పంచాయితీ.. ఎవరికి దక్కేను అవకాశం?

Select Suryaa Now
పీఏసీఎస్‌ పీఠాలపై పంచాయితీ.. ఎవరికి దక్కేను అవకాశం?

కొండాపూర్‌ ; కొండాపూర్‌ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) పదవుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఐదు సొసైటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. నియామకాల విధానం ఎలా ఉండబోతోంది? ఎవరికి అవకాశం కల్పిస్తారు? అనే ప్రశ్నలు స్థానికంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

ఐదు సొసైటీలు.. ఎన్నో ఆశలు!

మండల పరిధిలోని మల్కాపూర్‌, గొల్లపల్లి, తెర్పోల్‌, మారేపల్లి, కొండాపూర్‌ గ్రామాల్లో ఉన్న ఐదు పీఏసీఎస్‌ల పదవులపై నాయకులు దృష్టి సారించారు. పార్టీ కోసం పనిచేసిన తమకు అవకాశం కల్పించాలని కొందరు నేతలు ప్రయత్నిస్తుండగా, గతంలో పదవులు నిర్వహించిన కుటుంబాలు సైతం తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మల్కాపూర్‌, గొల్లపల్లి సొసైటీల్లో పదవుల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది.

సామాజిక సమీకరణాలపై లెక్కలు!

గతంలో సొసైటీల్లో పదవుల కేటాయింపులో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. మల్కాపూర్‌, మారేపల్లి సొసైటీల చైర్మన్‌ పదవులు బీసీ వర్గానికి, కొండాపూర్‌, గొల్లపల్లి, తెర్పోల్‌ సొసైటీల పదవులు ఓసీ వర్గానికి దక్కినట్లు స్థానికంగా చర్చ ఉంది. ఈసారి సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇస్తారా? లేక పార్టీ బలాబలాలు, స్థానిక నాయకుల ప్రభావం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మల్కాపూర్‌లో బీసీ, మారేపల్లిలో ఎస్టీ, తెర్పోల్‌లో ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలపై ప్రచారం జరుగుతోంది. గొల్లపల్లిలో ఓసీ వర్గానికి, కొండాపూర్‌లో మైనారిటీ వర్గానికి అవకాశం దక్కవచ్చనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.  ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సేవలకు గుర్తింపా.. వారసత్వానికి ప్రాధాన్యమా?

పదవుల పంపకంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందా? లేక గతంలో పదవులు నిర్వహించిన కుటుంబాలకే మరోసారి అవకాశం దక్కుతుందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, సహకార రంగంపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

అధిష్ఠానం నిర్ణయంపైనే దృష్టి

పీఏసీఎస్‌ పదవుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం, పార్టీ నాయకత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నామినేటెడ్‌ విధానంలో నియామకాలు చేపడతారా? ప్రస్తుత పాలకవర్గాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అధికారిక ప్రక్రియ ప్రారంభమైతే స్థానిక నాయకుల సిఫార్సులు, సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు కీలకంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా కొండాపూర్‌ మండలంలోని ఐదు పీఏసీఎస్‌ల పదవుల భర్తీపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, తుది నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.