పవిత్ర కార్తీక మాస పూజలు ప్రారంభం
లింగాల:
హిందువులకు అత్యంత
ప్రీతిపాత్రమైన, ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసే
పవిత్ర కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కాగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన లింగాలలోని పురాతన శివాలయం, మార్కండే ఆలయం, అయ్యప్ప ఆలయాలలో భక్తులు తెల్లవారుజామున నుంచే జ్యోతిలను వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శివకేశవులకు అత్యంత
ఇష్టమైన ఈ మాసంలో భక్తులు తెల్లవారుజామునే
స్నానాలు ఆచరించి, దీపారాధన చేయడం ద్వారా
విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతారని ప్రతీతి. ఆలయ ప్రాంగణంలో శివనామస్మరణంతో మారుమొగింది.
నెల రోజుల పాటు ఇళ్లన్నీ దీపాల కాంతులతో,
ఆలయాలు హర హర మహాదేవ నామస్మరణతో
మార్మోగనున్నాయి.