పట్టణ అధ్యక్షుడి దృష్టికి సృజన లక్ష్మీ నగర్ సమస్యలు…
అమీన్ పూర్;సృజన లక్ష్మీ నగర్ ఫేస్ టు కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, కాలనీ కమిటీ సభ్యులు నివాసితులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శశిధర్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు.కాలనీలోని పార్కును అలహాదకరంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సిసి రోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని కోరారు.సానుకూల స్పందన హామీ,కాలనీ కమిటీ సభ్యుల విజ్ఞప్తిపై శశిధర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ సమస్యలన్నింటిని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.అలాగే సంబంధిత జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి మరియు ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించి పెండింగ్ పనులు త్వరలోనే ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుజనలక్ష్మి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.