ఓటు హక్కు పరిరక్షణకు ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు
సూర్య కోనరావుపేట:ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోనరావుపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో నిర్వహించనున్న ఓటు హక్కు పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, కొలనూరు ప్యాక్స్ చైర్మన్ బొమ్మేన భాస్కర్ రావు, మాజీ ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్ పయనమయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడికి కల్పించిన ఈ హక్కును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.