నూతన సీఐ పి. కిరణ్‌ను కలిసిన పన్నాల కొండల్‌రెడ్డి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ నూతన సీఐ పి. కిరణ్‌ను ఘట్‌కేసర్ మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన సీఐ పి. కిరణ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా సేవలందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దోళ్ల రమేష్, కొట్టి గోపాల్ రెడ్డి, నాగరాజు చారి తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.