BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ

Select Suryaa Now
నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి అండ

పటాన్‌చెరు;నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కమ్మరి సుజాత, రామచంద్రాపురానికి చెందిన బండి సుజాత అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రూ.5 లక్షల విలువైన ఎల్ఓసీ అనుమతి పత్రాలను శనివారం ఎమ్మెల్యే జిఎంఆర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.