నిర్మల్ లో చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
హైదరాబాద్, ఆల్వాల్ : నిర్మల్ లో బిజిపి, సి. ఎల్. పి., నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వం లో మంగళవారం చేపట్టిన మహాపాద యాత్రలో పాల్గొని అనంతరం నిర్మల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పల్లెటూర్లలో ఓట్లు పోలేదు.. మరి 'ఓట్ చోరీ' ఎలా అవుతుంది? అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు పట్టవు, జనాల ముందుకు వచ్చి మొఖం చూపించే దమ్ము ఆ పార్టీకి లేదు.ఇవాళ ఎస్.ఐ.ఆర్. (SIR) ద్వారా చచ్చిపోయిన వారి ఓట్లు తీసేస్తే.. వాటిని ఉంచాలని కాంగ్రెస్ కోరుకోవడం సిగ్గుచేటు. ఒకరికి రెండు ఓట్లు ఉంటే, అందులో ఒకటి తొలగిస్తే దాన్ని తప్పుపట్టే వాళ్లను ఏమనాలి?" అని ఈటల మండిపడ్డారు.
నిర్మల్ లో గతంలో మహేశ్వర్ రెడ్డి నామినేషన్ రోజున 70 వేల మంది జనంతో 'మోదీ.. మోదీ' నినాదాలతో ఈ గడ్డ మారుమోగిపోయిందని, నేటి పాదయాత్రలోనూ అదే జోరు కనిపిస్తోందని అన్నారు.
నరేంద్ర మోదీ ఈ దేశ జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక గర్వించకపోయినా, భారతీయులందరూ గర్వపడే ముద్దుబిడ్డ మోదీ అని కొనియాడారు.
రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఆనాటి ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, రాజకీయాలను శాసించిన నియంతల చరిత్ర వారిదే. అప్పట్లో ఇందిరాగాంధీ కేవలం ఐదేళ్ల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చేశారు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలనే కూల్చేశారు. కానీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చిన చరిత్ర లేదు" అని స్పష్టం చేశారు.అమెరికా గడ్డపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. 'నరేంద్ర మోదీ గారు సంతకం పెడుతుంటే' ఆయన వెనుక నిల్చొని కుర్చీ పట్టారు.. అది మన మోదీ, మన దేశ గొప్పతనం.ట్రంప్ కాదు కదా, ట్రంప్ బాబుకు కూడా భయపడని ధీశాలి నరేంద్ర మోదీ" అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తమిళనాడు, కేరళలో గెలిస్తే ఈవీఎంలు, ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేసినట్టు అంటారు. వాళ్ళ మొహాలకు తెలంగాణలో గెలిచాక మాత్రం ప్రజలకు ఒరిగిందేమిటని ఈటల ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. కరెంట్ సరిగ్గా రావట్లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. రూ. 4000 పెన్షన్ రాలేదు, కొత్త పెన్షన్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, ఇస్తానన్న నిరుద్యోగ భృతి జాడే లేదు. మీ దొంగ మొహాలకు ఆరు గ్యారెంట్లు, 60 హామీలు, 400 రకాల పనులు చేస్తామని చెప్పి ఒక్కటైనా అమలు చేశారా?" అని నిలదీశారు.
ప్రభుత్వం మారుతుందని ఆశించి కాంగ్రెస్ను గెలిపించుకుంటే ప్రజలకు నిరాశే మిగిలిందని, ఇక ఆ పార్టీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు.ఇవాళ కేసీఆర్ పాలనను చూశారు, నేడు రేవంత్ రెడ్డి పాలనను చూస్తున్నారు.. రేపు రాబోయేది మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే! బీజేపీ అధికారంలోకి రాగానే మళ్లీ రోడ్లు వస్తాయి, తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ దోపిడీ ప్రభుత్వం అంతమవుతుంది. భారత చిత్రపటంపై తెలంగాణ ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
సునీల్ బన్సల్ నాయకత్వంలో బెంగాల్, ఒరిస్సాలో బీజేపీ జెండా ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. అదేవిధంగా సునీల్ బన్సల్ మార్గదర్శకత్వంలో, రామచందర్ రావు నాయకత్వంలో త్వరలో తెలంగాణ గడ్డపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
మహాపాద యాత్ర సందర్భంగా విచ్చేసిన సందర్భంగా..ఈటలకు గొప్పగా స్వాగతం పలికి, 'మోదీ ఆప్ ఆగే బడో, హమ్ తుమ్హారే సాత్ హై' అంటూ కషాయ జెండాలతో కదం తొక్కిన నిర్మల్ ఆడబిడ్డలకు, యువతకు, ప్రజానీకానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.