BREAKING
ఇండోనేషియాలో రహస్య ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను బర్తరఫ్ చేసిన ప్రెసిడెంట్ అమెరికా ఎన్నికల ఫలితాలతో ఆసియా దేశాల్లో కొత్త ఆశలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర ఒంటరవుతున్న డొనాల్డ్ ట్రంప్ మల్కారం - గుతావారిగూడెం మార్గంలో భారీగా వరద.. అటువైపు వెళ్ళొద్దు!* లచ్చాపురం- దిబ్బగూడెం దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు.. * ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - పామాయిల్ రైతు సంఘం నాయకుడు అంకత ఉమామహేశ్వరరావు పిలుపు ఓపెన్‌ఏఐ, మెటా ఏఐ చిప్ ఒప్పందాలతో ఏడీఎంఈకి బిలియన్ డాలర్ల భారం ప్రపంచ పరిశుభ్ర పరిశ్రమ పెట్టుబడుల్లో చైనా వాటా దాదాపు సగం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత తీవ్రం భారత్‌లో తయారీ రంగాన్ని మరింత విస్తరించనున్న పేజ్ ఇండస్ట్రీస్ యలమంచిలి కూటమిలో డిష్యుం డిష్యుం: టీడీపీ, జనసేన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ! భారత సేవా రంగంలో జోరు.. నాలుగు నెలల గరిష్టానికి సర్వీసెస్ పీఎంఐ వృద్ధి టొయోటా మోటార్స్ త్రైమాసిక లాభాల్లో దూకుడు కెన్యా ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించిన ప్రపంచ బ్యాంకు ఐయోవాలో రిపబ్లికన్ల కంచుకోటను కైవసం చేసుకున్న జోష్ తురెక్ ఆస్ట్రేలియాలో టీనేజర్ల సోషల్ మీడియా నిషేధంపై హైకోర్టులో వాదనలు మల్లెపూల వాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడు పైడి వెంకటేశ్వరరావు

కుటుంబ కలహాలతో ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య.. మర్పల్లి మండలంలో విషాదం

Select Suryaa Now
కుటుంబ కలహాలతో ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య.. మర్పల్లి మండలంలో విషాదం

మర్పల్లి, మేజర్ న్యూస్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మర్పల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మంగళ వీరేశం మంగళవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలిగా సంగారెడ్డి ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ తుమ్మలపల్లికి రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే వీరేశం ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. విధి నిర్వహణలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు ఆకస్మికంగా మృతి చెందడంతో ఉపాధ్యాయ వర్గాల్లో విషాదం నెలకొంది. మర్పల్లి మండల విద్యాధికారి అశోక్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు వీరేశం మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.