BREAKING
చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు* ట్రంప్ ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఒరాకిల్ ఐదుసార్లు గెలిచిన సూజన్ కాలిన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన డెమోక్రాట్ ట్రాయ్ జాక్సన్ పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

మల్లెపూల వాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడు పైడి వెంకటేశ్వరరావు

Select Suryaa Now
మల్లెపూల వాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడు పైడి వెంకటేశ్వరరావు

సూర్యదమ్మపేట,మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో 112.6 శాతం వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు, దమ్మపేట మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు బుధవారం మండలంలోని దురదపాడు పొంగిపొర్లుతున్న మల్లెపూల వాగును క్షేత్రస్థాయిలో సందర్శించారు. వాగు ఉధృతిని పరిశీలించి, స్థానికులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పైడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మండల ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటే సాహసం చేయవద్దని హెచ్చరించారు. వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కరెంట్ స్తంభాలను ముట్టుకోవద్దని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మండల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట