మల్కారం - గుతావారిగూడెం మార్గంలో భారీగా వరద.. అటువైపు వెళ్ళొద్దు!* లచ్చాపురం- దిబ్బగూడెం దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు.. * ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - పామాయిల్ రైతు సంఘం నాయకుడు అంకత ఉమామహేశ్వరరావు పిలుపు
సూర్యదమ్మపేట,
మల్కారం నుండి గుతావారిగూడెం గ్రామం మధ్యలో ఉన్న గిట్టం చెరువు కొమ్ము భారీగా ప్రవహిస్తోందని, ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలందరూ తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పామాయిల్ రైతు సంఘం నాయకుడు అంకత ఉమామహేశ్వరరావు కోరారు. కాలవ ఉధృతి తగ్గే వరకు అటువైపు ప్రయాణాలు పూర్తిగా నిలిపివేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లచ్చపురం నుండి దిబ్బగూడెం వెళ్లే దారిలో కూడా చెరువు కొమ్ము ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. అదేవిధంగా లచ్చపురం నుండి రాచురిపల్లి వెళ్లే మార్గంలో కొర్రాజుల చెరువు కొమ్ము నీరు రోడ్డుపైకి చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తోందని పేర్కొన్నారు.
కావున ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, బాటసారులు వరద నీటి ఉధృతి తగ్గే వరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అంకత ఉమామహేశ్వరరావు సూచించారు.
సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట