తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం.. ముర్రుపాలు పట్టించడం ప్రతి తల్లి బాధ్యత: ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదారాణి
నల్గొండ జిల్లా కట్టంగూర్ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదారాణి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తల్లిపాలలో శిశువుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు.
అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్, వార్డు సభ్యులు మైనం ఉమ, ఏనుగు సైదులు, శ్రీరామ సంధ్య, కల్లెం నాగేశ్వరరావు, అంగన్‌వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.