BREAKING
నిర్మల్ లో చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి: వెంకటేష్ యాదవ్, అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం.. ముర్రుపాలు పట్టించడం ప్రతి తల్లి బాధ్యత: ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదారాణి ఎక్సైజ్ అధికారుల దాడులు సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకున్న అన్నీ ఆండ్రూస్ అమెరికా ప్రతినిధుల సభపై డెమోక్రట్ల ఆధిక్యం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు... డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానాలు కీసర అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమేనా? నిఘా ఎక్కడ? భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి నేడు సోమినికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక *కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.* కార్మికుల వేతనంతో కూడిన సెలవు రామచంద్రపురంలో టిడిపి విజయ డంక

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

Select Suryaa Now
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

సూర్య అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ సూచించారు.

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.

ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట