BREAKING
ఎక్సైజ్ అధికారుల దాడులు సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకున్న అన్నీ ఆండ్రూస్ అమెరికా ప్రతినిధుల సభపై డెమోక్రట్ల ఆధిక్యం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు... డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానాలు కీసర అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమేనా? నిఘా ఎక్కడ? భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి నేడు సోమినికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక *కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.* కార్మికుల వేతనంతో కూడిన సెలవు రామచంద్రపురంలో టిడిపి విజయ డంక రూ. 17 కోట్లకు ఇంటిని విక్రయించిన దర్శక-నటుడు జస్టిన్ బాల్డోని భారత్‌ను దాటిన బంగ్లాదేశ్? పంచాయత్ వెబ్‌సిరీస్ విజయంపై నటుడు చందన్ రాయ్ ఆసక్తికర జ్ఞాపకాలు అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ పూర్తి

*కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.*

Select Suryaa Now
*కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.*

*మధిర ఆర్టీసీ డిపో వద్ద బంద్ పాటిస్తున్న కార్మికులు*

మధిర, సూర్య మేజర్ న్యూస్ :

విధి నిర్వహణలో ప్రయాణికురాలి చేతిలో దారుణమైన దాడికి గురై, చికిత్స పొందుతూ మరణించిన మణుగూరు డిపో ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతికి సంతాపంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (JAC) ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సుల బంద్‌కు పిలుపునిచ్చింది.అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద బానోత్ మౌనిక అనే ప్రయాణికురాలితో కండక్టర్ ప్రవళికకు హాఫ్ టికెట్ మరియు చిల్లర విషయంలో వివాదం జరిగిన విషయం తెలిసిందే. వాగ్వాదం తీవ్రమవడంతో సదరు ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళికను కదులుతున్న బస్సు ద్వారం నుండి రోడ్డుపైకి నెట్టివేసింది. దీంతో ప్రవళిక బస్సు వెనుక టైర్ల కింద పడిపోవడంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాల య్యాయి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రవళిక, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా బుధవారం (నవంబర్ 4, 2026) మధిర ఆర్టీసీ డిపో వద్ద  ఆర్టీసీ బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తూ జేఏసీ బంద్‌కు పిలుపుమేరకు బంధు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులందరూ విధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి దాడులు జరగకుండా కఠినమైన రక్షణ చర్యలు చేపట్టాలని, నిందితురాలిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ తరఫున రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.