కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.