BREAKING
టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ

నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం

Select Suryaa Now
నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం

బి-40 క్వార్టర్ వ్యవహారంపై జీఎం రాధాకృష్ణ వివరణ

సూర్య, మందమర్రి.సింగరేణి సంస్థకు చెందిన బి-40 క్వార్టర్‌ ఖాళీ చేయింపు ప్రక్రియ సంస్థ నిబంధనలు, విజిలెన్స్‌ నివేదిక ఆధారంగానే చేపట్టామని మందమర్రి ఏరియా జీఎం ఎన్‌. రాధాకృష్ణ తెలిపారు. ఈ వ్యవహారంలో స్థానిక మంత్రి వివేక్‌ వెంకటస్వామి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బి-40 క్వార్టర్‌లో మద్దిశంకర్‌ అనే వ్యక్తి అనధికారికంగా నివాసం ఉంటున్నట్లు విజిలెన్స్‌ నివేదికలో గుర్తించినట్లు జీఎం వెల్లడించారు. క్వార్టర్‌ కేటాయింపుపై ఎస్టేట్‌, పర్సనల్‌ విభాగాల ద్వారా వివరాలు పరిశీలించామని చెప్పారు. మంత్రికి ఇప్పటికే బి-1 క్వార్టర్‌ను క్యాంపు కార్యాలయంగా కేటాయించామని, బి-40 క్వార్టర్‌ను ఆయనకు గానీ, వివేక్‌కు గానీ అధికారికంగా కేటాయించలేదని వివరించారు. క్వార్టర్‌ ఖాళీ చేయాలని మద్దిశంకర్‌కు తొలుత కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అనంతరం జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో మూడుసార్లు నోటీసులు జారీ చేశామని జీఎం తెలిపారు. జూలై 27న పర్సనల్‌ విభాగం ద్వారా మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయినా క్వార్టర్‌ ఖాళీ చేయకపోవడంతో తదుపరి ప్రక్రియలో భాగంగా ఫారమ్‌-ఎ, ఫారమ్‌-బి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్‌ అండ్‌ పీసీ విభాగం, పోలీసు శాఖ, ఎస్టేట్‌ అధికారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య క్వార్టర్‌ను ఖాళీ చేయించినట్లు చెప్పారు. మద్దిశంకర్‌కు ఫోన్‌ చేసినా రాకపోవడంతో అక్కడున్న సామగ్రిని తరలించి సురక్షిత ప్రాంతంలో భద్రపరిచామని వివరించారు. అనంతరం ఆ క్వార్టర్‌ను మరో సింగరేణి ఉద్యోగికి కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని జీఎం పేర్కొన్నారు. క్వార్టర్‌ ఖాళీ చేయింపు వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు.