BREAKING
ఇరాన్‌పై తక్షణ సైనిక దాడి లేదు.. స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్: *మధిరలో బియ్యం ధరలకు కళ్లెం వేయాలి.* పెడనలో కూటమి అభ్యర్థుల విజయానికి బుద్ధప్రసాద్ ప్రచారం బెజ్జూర్ ప్రజావాణికి 8 దరఖాస్తులు - 12 మంది అధికారులు హాజరు. రోడ్డు భద్రతపై అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు - సిఐ జయచంద్ర ఉయ్యూరులో అభివృద్ధి పనులే కీలకం ఘనంగా నూతన ఎంపీడీవోకు సన్మానం 24వ వార్డులో విజయకుమారి నాగ ఎన్నికల ప్రచారం ఘనంగా మహర్షి జయంతి వేడుకలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజయదశమి శుభాకాంక్షలు 17, 18, 25వ వార్డుల్లో టీడీపీ ప్రచారం వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: కలెక్టర్ దీపక్ తివారి భూ సమస్య పరిష్కరించాలని వినతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ధర్మబద్ధమైన మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి నిజమైన నివాళి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి

నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు….

Select Suryaa Now
నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు….  - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు…  - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు….

సూర్య నాగిరెడ్డిపేట్ :

పార్వతీ పారమేశ్వరుల ప్రాణ పుత్రుడు. గణనాథుడు నేడు కొలువుదీరనున్నాడు. ఉండ్రలయ్యాకు దండాలుపెడుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సమాయత్తమయ్యారు. విఘ్నాలు తొలగించు వినాయక.. అంటూ మండపాల్లో వెలసిన దేవదేవుడికి విన్నవించే రోజు నేటి నుండి ప్రారంభం కానున్నది. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వినాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్తోత్రంతోనే పూజలు ప్రారంభించడం అనవాయితీ. సోమవారం మండపాల్లో కొలువుదీరనున్న  వినాయకుడి కోసం మండలంలోని అన్ని గ్రామాలలో మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో, ఇతర అలంకరణలతో నిర్వాహకులు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు మండపాల నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో విగ్రహాలను తీసుకెళ్తున్నారు. పండుగ వేళ పూజ సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో మండల కేంద్రంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సోమవారం నుండి తొమ్మిది రోజులపాటు వినాయకుడు ఘనంగా పూజలు అందుకోనున్నాడు.