BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ

Select Suryaa Now
నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం మరియు భానుడి ప్రతాపంతో ఉత్పన్నమయ్యే సవాళ్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే ఎనిమిది నెలల పాటు ఎదురయ్యే విద్యుత్, నీటి కొరత ముప్పును తట్టుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (Action Plan) రూపొందించనున్నారు. ముఖ్యంగా పంటల రక్షణ కోసం రైతులకు నిరంతరాయంగా సాగునీరు, విద్యుత్ అందించడం, పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించనున్నారు. కరవు ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేస్తూ గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వార్ రూమ్‌లు ఏర్పాటు చేయడంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.