telangana
నార్నూర్ నుండి గాదిగూడాకు డబుల్ రోడ్ మంజూరు చేయించండి
సూర్య నార్నూర్ : నార్నూర్ మండలంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బిక్కు రాథోడ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఉట్నూర్ మండలం ఎక్స్ రోడ్ నుండి నార్నూర్ వరకు రోడ్డు అద్వానంగా తయారు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం ఈరోడ్ పై ప్రయాణిస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా స్పందించి ఉట్నూర్ నుండి నర్నూర్ మీదుగా గడిగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరు చెయ్యాలని లేదంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు...