BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

Select Suryaa Now
మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్

మరిపెడ, మేజర్ న్యూస్, పట్టణ పరిశుభ్రతలో మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ కొనియాడారు. మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం  ఏడోరోజు వేపకాయ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ వర్కర్లకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణం అభివృద్ధి దశలో మున్సిపల్ సిబ్బంది పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. వారి సేవల తోనే పట్టణం పరిశుభ్రతతోనిండి ఉంటుందని పేర్కొన్నారు.మున్సిపల్ పాలక వర్గం,అధికారులు, సుబ్బంది తో కలసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కమిషనర్ నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;చంద్రశేఖర్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా