BREAKING
కాంగ్రెస్ పార్టీ ప్రచారం విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి... నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా! విభిన్న సంస్కృతులను గౌరవించడం, ఆదరించడమే భారత బలం రాయదుర్గంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్, సీఐ!! ముగిసిన రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీలు - బహుమతులు అందజేసిన  "బండి" , " కవ్వంపల్లి" ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి బీహార్ ఇక వెనుకబడిన రాష్ట్రం కాదు: నితీష్ సేతుపై మాంఝీ హర్షం ఆపద వేళ కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా - నెల రోజుల పాటు కొనసాగింపు ఫీజుల వివరాలు ప్రకటించాకే విద్యాశాఖలో విలీనం చేయాలి ప్రజా సమస్యల పరిష్కారానికి కేఎన్నార్ మార్నింగ్ వాక్ మేనిఫెస్టో హామీలకు మూడేళ్ల మంగళం! సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి నిరంతర కృషి

ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి........

Select Suryaa Now
ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి........

మద్దూర్ …ముదిరాజుల హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముదిరాజ్ మహాసభ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్ ముదిరాజ్ అన్నారు. శనివారం ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏలోకి మారుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ముదిరాజుల హక్కులు సాధించేవరకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఇతర వృత్తి సంఘాల కార్మికులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు పెన్షన్లు అందిస్తున్నప్పటికీ మత్స్యకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిరాజులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ అధ్యక్షులు సంఘం నాయకులు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.