మొక్కలు నాటిన కమాండెంట్
సూర్య డిచ్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌లో బెటాలియన్ కమాండెంట్ బి.సీతారాం గులాబీ మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ బెటాలియన్ ప్రాంగణాన్ని మరింత ఆహ్లాదకరంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు గార్డెన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సిబ్బందికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చన్నారు.గులాబీ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను సిబ్బంది సమిష్టిగా చేపట్టాలని సూచించారు. బెటాలియన్ పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి, విజయ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, నవనీత్, నార యణ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.