BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం

Select Suryaa Now
మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం

దేవరుప్పుల , మేజర్ న్యూస్, దేవరుప్పుల మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో మేనక పౌడేల్ ఆధ్వర్యంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించిన పలు సాధారణ అంశాలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై సమీక్షించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోతో పాటు వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రిపోర్టర్, ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా