BREAKING
సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!? ఆ డైరెక్టర్లకు జీవితాంతం రుణపడి ఉంటా: శర్వానంద్

మౌలిక వసతులు అభివృద్ధి పనులపై దృష్టి

Select Suryaa Now
మౌలిక వసతులు అభివృద్ధి పనులపై దృష్టి

మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి 
==================
నియోజకవర్గ అభివృద్ధికి రూ. 5 కోట్లు నిధులు విడుదల
===================
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
--------------------------------
ఖమ్మం బ్యూరో చీఫ్ / సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...

సింగరేణి సంస్థ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  సమక్షంలో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ వివరించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చర్చించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం కలగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్  మాట్లాడుతూ...సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత   క్రమంలో చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మట్ట రాగమయి తెలిపారు.