telangana
మథురనగర్ కాలనీలో పిచ్చిమొక్కల తొలగింపు
సూర్య.నేరడిగొండ: మండల కేంద్రంలోని 7వ వార్డు మథురనగర్ కాలనీలో రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించే పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోతి గులాబ్ సింగ్, కార్యదర్శి అరుణ్ రెడ్డి, కారోబారి పోశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పారిశుధ్య పనులు నిర్వహించారు. సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. పిచ్చిమొక్కల తొలగింపుతో రహదారి పరిశుభ్రంగా మారడంతో పాటు ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా రవాణా సౌకర్యం మెరుగుపడిందని స్థానికులుప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.