మరణంలోనూ సాయం - నేత్రదానంతో దాతృత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు
సూర్య,అశ్వారావుపేట,మరణం తర్వాత కూడా మరొకరికి వెలుగునివ్వాలనే గొప్ప సంకల్పంతో కీ.శే. పసుపులేటి నాగ ప్రసాద్ కుటుంబ సభ్యులు దాతృత్వాన్ని చాటుకున్నారు.ఆదివారం (18-10-2026) అకాల మరణం చెందిన నాగ ప్రసాద్ నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. మరణం బాధలో కూడా మానవత్వాన్ని మరిచిపోకుండా, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే గొప్ప నిర్ణయం తీసుకున్నారు.అరుణాచల శివ సేవా సమితి ఆధ్వర్యంలో, పమిడి లక్ష్మణరావుమానేపల్లి రవీంద్ర బాబు, దామెర బాబీ,సహకారంతో వైద్య బృందం నేత్ర సేకరణను విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన నేత్రాలను ఇద్దరు అంధులకు అమర్చడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపనున్నారు.
ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ,నాగ ప్రసాద్ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని, నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను వారు ప్రత్యేకంగా అభినందించారు.నాగ ప్రసాద్ భౌతికంగా దూరమైనా, ఆయన నేత్రాల ద్వారా ఇద్దరి కళ్ళలో వెలుగుగా బ్రతికి ఉంటారని స్థానికులు, బంధువులు కొనియాడారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట