మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మజ్లిస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మహేశ్వరం ఎంఐఎం ఇంచార్జ్ అహ్మద్ సాది
జల్ పల్లి : మజ్లిస్ కార్యకర్తలు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గ ఎంఐఎం పార్టీ ఇంచార్జ్ అహ్మద్ సాది అన్నారు. ఈ మేరకు సోమవారం షాహిన్ నగర్ లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంఐఎం పార్టీ కోశాధికారి మోహిన్ బలాల ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంఐఎం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, జల్ పల్లి సర్కిల్ పరిధి, షాహినగర్, జల్ పల్లి, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రజల్లో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో గల్లంతైన ఓట్లను గుర్తించి, తిరిగి ఓట్లు పొందేలా ఫారం-8ఏ నింపి అధికారులకు అందించేలా ఓటర్లను చైతన్యపరచాలన్నారు. అలాగే ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. కేవలం ముస్లింల ఓట్లే కాకుండా దళిత, వెనుకబడిన హిందు ఓటర్లను కూడా కలుపుకొని ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మాజీ చైర్మన్ అబ్దుల్లా సాది, మాజీ వైస్ ఎంపీపీ ఉమర్ బామ్, సాలం బిన్ బదర్ హమ్ది, సయ్యద్ అలీ, షేక్ ఖదీర్,అసన్ షా, హమీద్, షేక్ అలీమ్, హాజీ నవాబ్, సయ్యద్ నయీమ్, అసద్ తదితరులు పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్,