BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

మహాశక్తి దేవాలయంలో వైభవంగా లక్ష్మీ కుబేర హోమం

Select Suryaa Now
మహాశక్తి దేవాలయంలో వైభవంగా లక్ష్మీ కుబేర హోమం

 సూర్య కరీంనగర్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో లక్ష్మీ కుబేర హోమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను శ్రీ మహాలక్ష్మి అవతారంలో వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించగా భక్తులకు కనులవిందుగా దర్శనమిచ్చారు.

దీపావళి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, లక్ష్మీ కుబేర హోమంలో పలువురు భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించి విశేష అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.