BREAKING
టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కీలకం పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పచ్చల నడుకుడలో ఎస్ఎస్సీ 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూటమి పార్టీల మద్దతుతో వార్డుల అభ్యర్థుల నామినేషన్... నరసన్నపేట, నవంబర్ 22 మేజర్ న్యూస్: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. 10, 12, 13, 14, 17వ వార్డులకు చెందిన అభ్యర్థులు భారీ ప్రదర్ మెండోరా మండల అభివృద్ధికి రూ.2.85 కోట్ల నిధులు మంజూరు పచ్చల నడుకుడలో శ్రీశ్రీశ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఓటు హక్కు గురించి ప్రశ్నించే అర్హత లేదు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువత స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి సీతారామ భద్రాక్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం అయోధ్య నుంచి జనక్‌పూర్ వరకు కొత్త రైలు సర్వీసు.. రేపు ప్రారంభించనున్న ఇరు దేశాల ప్రధానులు మేయర్ పదవే రాజకీయ లక్ష్యమా..? సర్పంచ్ అభ్యర్థిగా ధర్మాన ప్రభాకర్ రావు నామినేషన్ దాఖలు

మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.

Select Suryaa Now
మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.

మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్):
మండల పరిధిలోని చిన్న నల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూనెం బాపనయ్య శనివారం గుండెపోటు తో అకస్మాత్తుగా మృతి చెందారు.ఆయన మరణ వార్తతో చిన్న నల్లబల్లి గ్రామంలో విషాద శాయలు అలుముకున్నాయి.
గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో బాపనయ్య గ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని స్థానిక నాయకులు కొనియాడారు.సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గ్రామంలో ఎటువంటి గొడవలు,తగాదాలు వచ్చినా బాపనయ్య గారే ముందుండి పెద్దరికం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి ఎవరికీ నష్టం జరగకుండా ఎన్నో కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి ఆదర్శవంతమైన తీర్పులు చెప్పేవారని గ్రామ పెద్ద దిక్కుగా ఉండి అందరినీ కలుపుకెళ్లే ఆయన నాయకత్వాన్ని కోల్పోవడం గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.పూనెం బాపనయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నేడు చిన్ననల్లబల్లి కాలనీ వారి స్వగృహంలో అంత్యక్రియలు జరుగుతాయి.