కొల్లూరులో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత
రామచంద్రాపురం;మత్తు పదార్థాల అక్రమ రవాణాపై రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు శుక్రవారం ఓఆర్ఆర్ ఎగ్జిట్-2, గద్దర్ సర్కిల్ సమీపంలో పోలీసులు దాడి నిర్వహించి ఎండీఎంఏ డ్రగ్స్‌తో వెళ్తున్న యువకుడిని పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన గొసంగి వెంకట సాయి చరణ్ (27) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థం, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.12 వేలతో ఎండీఎంఏ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఇద్దరు వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయాల్సిన ఇద్దరిని గుర్తించి పట్టుకునేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు.