కోహిర్ మండల్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్‌కు మాజీ మంత్రి చంద్రశేఖర్ ఘన సన్మానం
కోహిర్;కోహిర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్‌కు జహీరాబాద్‌లో ఘన గౌరవం లభించింది. జహీరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా. ఎ. చంద్రశేఖర్ అశోక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అశోక్ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి. సువర్ణ మల్లన్న పాటిల్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు హర్షద్ అలీ, కండెం నర్సింలు, బాబు, శ్యాంసన్, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.