దుర్గామాత విగ్రహాన్ని అందజేసిన ధనరాజ్ ముదిరాజ్
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో పోచమ్మ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ఉత్సవాలు నిర్వహించేందుకు అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన ధనురాజ్ ముదిరాజ్ దుర్గామాత విగ్రహాన్ని అందజేశారు. అమ్మవారి పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ విగ్రహాన్ని అందించిన ఆయనను గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ధనురాజ్ ముదిరాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.