ఎన్నికల సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలు,సంబంధిత వర్గాలు ఎదుర్కొనే సమస్యలు,ఫిర్యాదుల స్వీకరణ కోసం మదనపల్లి కలెక్టరేట్ 24/7 ప్రకారంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కంట్రోల్ రూమ్ నిర్వహణకు సంబంధించి హౌసింగ్ మరియు మెప్మా పీడీలను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు,ఫిర్యాదులు లేదా ఇతర అంశాలు ఉంటే ప్రజలు 08571-293001 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని సూచించారు.అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి