ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం అభ్యర్థులకు మద్దతివ్వాలి
టి. నరసాపురం, మేజర్ న్యూస్:స్థానిక ఎన్నికల్లో మండలంలోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం పోరాడుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి. రామకృష్ణ తెలిపారు. సోమవారం ఏఎస్‌ఆర్ నగర్‌లో గూడేలి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇళ్ల స్థలాలు, తాగునీరు, అంతర్గత రహదారుల సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం పోరాడుతోందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి మడకన్ సుధారాణి, మండల కమిటీ సభ్యులు కుమారి, బరకడ కుమారి, హనుమాన్ మురళి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు,