రాజకీయ పార్టీల నాయకుల తో సమావేశం నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు
జీలుగుమిల్లి: సూర్య న్యూస్ రాజకీయ పార్టీ నాయకులకు ఎన్నికల నియమాలు పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్. సాయి బుచ్చారావు ఆదివారం సమావేశం నిర్వహించారు. త్వరలో జరుగనున్న మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల షెడ్యూలు వివరములను తెలియజేశారు. జీలుగుమిల్లి మండల పరిధిలో గల గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయములో సమావేశము జరిగింది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు అమలులో ఉన్న విషయము తెలియజేశారు. అదే విధముగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయాలి అనే అంశం వివరించారు.మండల పరిధిలో ఏ ప్రాంతాలలో పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేశారో ఆ వివరాలను వెల్లడించారు. ఎన్నికల షెడ్యూలు పూర్తి వివరాలు తెలిపారు. ఈ సమావేశానికి మండలములోని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టి, సి.పి.ఎం తరపున ప్రతినిదులు పాల్గొనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో కె. వెంకట లక్ష్మి, తహసీల్దారు జి. వేంకటేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్సై వి .క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
రిపోర్టర్: బొంతు రామకృష్ణ. జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా.