సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయం మహిళల్లో చైతన్యం నింపిన ‘అక్షర రంగవల్లులు’ కార్యక్రమం
టి. నరసాపురం, మేజర్ న్యూస్:సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర (ఉల్లాస్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అక్షరాంధ్ర సూపర్వైజర్ కె. కృష్ణారావు పిలుపునిచ్చారు. అక్షరాంధ్ర కార్యక్రమం రెండో దశలో భాగంగా జిల్లాలో సుమారు 95 వేల మందికి పైగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందని ఆయన తెలిపారు.మండలం సింగరాయపాలెం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సహకారంతో సోమవారం మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ‘అక్షర రంగవల్లులు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో చదువు ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించడంతో పాటు అక్షరాస్యత ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బొమ్మగాని బాలకృష్ణ ఆర్థిక సహకారంతో బహుమతులను ప్రదానం చేశారు. అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలాగని రమేష్, బచ్చు గణేష్, తాండ్ర మురళి, శ్రీనివాస్, సూపర్వైజర్ ఎం.వి.వి. సుబ్బారావు, శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు జిల్లా,