కూటమినేతలంతా కలిసికట్టుగా ఉన్నాం... అపోహలు నమ్మద్దు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
జీలుగుమిల్లి మేజర్ న్యూస్: కూటమి విడిపోయింది నాయకులు కలిసికట్టుగా లేరు అనే అసత్య ఆరోపణలను నమ్మద్దని.. కూటమి నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని పోలవరం శాసనసభ్యుల చిర్రి బాలరాజు ప్రకటించారు. సోమవారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం వద్ద పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామని అపోహలకు తావు లేదని ప్రకటించారు. వైసిపి కావాలనే అసత్య ప్రసారాలు చేస్తుందని ఆరోపించారు. సవాల్ చేసి చెబుతున్నా వంద శాతం కూటమి అభ్యర్థులకు గెలుస్తారఅని ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి తమ అభ్యర్థులు విజయం సాధించేలా చేస్తుందని అన్నారు. పోలవరం నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత కూటమికే దక్కుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పారేపల్లి రామారావు, ఉండవల్లి సోమ సుందరం సుంకవల్లి సాయి కృష్ణ, శీలం వెంకటేశ్వరరావు, జయ్యవరపు శ్రీరామ్ మూర్తి, నాయుడు రామకృష్ణ, నాలి శ్రీనివాస్, తోట బాలరాజు, కూరాకుల రవీంద్ర, కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: బొంతు రామకృష్ణ.జీలుగుమిల్లి ఏలూరు జిల్లా