అప్పాజీపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
కొల్చారం;కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాలం నర్సింలు, వార్డు సభ్యులు సదాల నర్సింలు, కన్నెబోయిన శేకులు, రామాంజనేయులు, సావిత్రి, సుశీల, యువకులు చింతల సురేందర్, పితిరి శ్రీను, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతల భాగయ్య, రవి, రాజబోయిన జోగులు, గౌండ్ల సురేందర్, సదాల తిరుపతి, కొంగోటి వీరేశం, ఫీల్డ్ అసిస్టెంట్ సదాల సత్యనారాయణ, తిమ్మాకాపల్లి యాదగిరి, దాకనోళ్ల పోచయ్య, దాది కృష్ణ, కన్నెబోయిన శరత్, జోగు శ్రీశైలం, వంశరాజ్ సంఘం సభ్యులు మాణిక్యం, మహేష్, గణేష్, రవి, రాజు, శంకరయ్య, పండు తదితరులతో పాటు గ్రామపంచాయతీ మల్టీ వర్కర్స్ పాల్గొన్నారు.