BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

కిరాణా షాపుల్లో చోరీ-షటర్లు పగలగొట్టి నగదు, సరుకుల అపహరణ

Select Suryaa Now
కిరాణా షాపుల్లో చోరీ-షటర్లు పగలగొట్టి నగదు, సరుకుల అపహరణ

మహబూబాబాద్ టౌన్, మేజర్ న్యూస్, మహబూబాబాద్ పట్టణంలో పత్తిపాక రోడ్డులో కిరాణా షాపుల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున షాపుల షట్టర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదుతో పాటు సరుకులను అపహరించినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం, తెల్లవారుజామున ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపు యజమాని చిదిరాల రవిశంకర్ ఉదయం షాపు తెరిచేందుకు రాగా, షట్టర్లు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపల పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పట్టణంలోని కిరాణా షాపుల్లో చోరీ ఘటన వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని మరింత పెంచాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.

రిపోర్టర్; ఓల్లాల సాయికృష్ణ , మహబూబాబాద్