BREAKING
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ డిసెంబర్‌లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు అంతర్జాతీయ క్రీడల్లోకి రష్యా పునరాగమనానికి యూరప్ దేశాల అడ్డుకట్ట జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం బెల్జియం బడ్జెట్ చర్చలకు డిసెంబర్ 31 గడువు చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం ఏర్పాటు అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు జాంబియా ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నాకు ఇంకా పెళ్లి కాలేదు.. వైరల్ వీడియో కామెంట్‌పై డింపుల్ హయాతి స్పందన ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

కేసీఆర్ సీఎం కావాలని మహా పాదయాత్ర

Select Suryaa Now
కేసీఆర్ సీఎం కావాలని మహా పాదయాత్ర

నవాబుపేట సూర్య న్యూస్:తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నవాబుపేట మండలంలో మహా పాదయాత్ర చేపట్టారు. మండలంలోని దయపంతులపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు గండు తిరుపతయ్య సోమవారం ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.మండలంలోని పర్వతపూర్ మైసమ్మ దేవాలయం నుంచి గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు పాదయాత్రగా బయలుదేరారు.2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని,జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని,మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తిరిగి పాలమూరు ఎంపీగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ యాత్ర చేపట్టినట్లు తిరుపతయ్య తెలిపారు.అంతకుముందు పర్వతపూర్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మాడెమోని నరసింహులు,మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు గండు చెన్నయ్య ప్రతాప్,నవాబుపేట మాజీ సర్పంచులు గోపాల్ గౌడ్,కృష్ణయ్య,తాహెర్,మెండే లక్ష్మయ్య, పాశం గోపాల్,కృష్ణయ్య,మెండే శ్రీను,రాజు,శ్రీశైలం,నరసింహులు,మాధవులు తదితరులు పాల్గొన్నారు.